Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్ర పిటిషన్లపై విచారణ ఎల్లుండికి వాయిదా


ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం  ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సండ్ర వెంకటవీరయ్య  పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏసీబీ చట్టం వర్తించదని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 
 

cash for vote: Supreme court adjourns revanth reddy, sandra venkata veeraiah petitions on August 25
Author
Hyderabad, First Published Aug 23, 2021, 2:59 PM IST

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు వ్యవహరంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిటిషన్లపై ఎల్లుండి విచారణ చేుపట్టనున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరీ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం  ఈ పిటిషన్లను విచారిస్తోంది.

ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను  2020 డిసెంబర్  8వ తేదీన హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసు విచారణలో  ఏసీబీ చట్టం వర్తించదని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios