Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ మాట ఇదీ: రేవంత్ రెడ్డికి చిక్కులే?

నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు కూడా పలు చోట్ల చోటు చేసుకుంది.

Cash for vote may haunt Revanth Reddy
Author
Hyderabad, First Published Dec 13, 2018, 3:06 PM IST

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు తిరిగి కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డిని చుట్టు ముడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుపై ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పందించారు. దర్యాప్తు కొనసాగుతోందని, అక్కడ చేయడానికేం ఉందని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. ఆ విషయాన్ని కేసిఆర్ తేలికగా తీసిపారేసినట్లు కనిపించారు. 

కేసీఆర్ అలా అన్నప్పటికీ కేసు రేవంత్ రెడ్డికి చిక్కులు తెచ్చి పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు కూడా పలు చోట్ల చోటు చేసుకుంది. 

స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయల లంచం ఇస్తుండగా 2015 మే 31వ తేదీన ఎసిబీ అధికారులు రేవంత్ రెడ్డిని, హరీ సెబాస్టియన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios