కోర్టు ఆదేశాలు: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ త్రీటౌన్‌లో కేసు
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. కరీంనగర్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు పెట్టారు. హిందూ దేవతలను కించపర్చేలా వ్యవహరించారనే కారణంగా న్యాయవాది ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
కరీంనగర్: వీఆర్ఎస్ తీసుకొన్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.హిందూ దేవతలను కించపర్చేలా వ్యవహరించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
also read:ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు... కరీంనగర్ పోలీసులకు కోర్టు ఆదేశం
ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని రెండు రోజుల క్రితం కరీంనగర్ జ్యూడిషీయల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.ఈ ఏడాది మార్చిలో పెద్దపల్లి జిల్లాలోని జూలపెల్లి మండలం దూళికట్ట గ్రామంలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో హిందూ దేవుళ్లను కించపర్చేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరించారని న్యాయవాది ఫిర్యాదు చేశాడు.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.