టీపీసీసీ చీఫ్, హుజూర్‌నగర్ మహాకూటమి అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మల్లారెడ్డిగూడెం, దొండపాడు గ్రామాల్లో శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత అభ్యర్థులు ప్రచారం నిర్వహించరాదు. ఈ సమయంలో అక్కడ తనిఖీకి వచ్చిన ఫ్లయింగ్ స్వ్వాడ్ ఉత్తమ్‌పై కేసు నమోదు చేయాలని చింతలపాలెం పోలీసులకు సిఫారసు చేశారు. ఆయన సూచన మేరకు పోలీసులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.