హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది.  జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద అర్థరాత్రి  ఓ వ్యక్తి బెంజ్ కారులో వచ్చి బీభత్సం సృష్టించాడు.  సిగ్నల్ వద్ద టర్న్ చేస్తుండగా అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టింది. కారు అతి వేగంతో రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు  చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. అయితే... పోలీసులు వస్తే తనను అరెస్టు చేస్తారేమోననే భయంతో డ్రైవర్ కారు అక్కడే వదిలి పారిపోవడం గమనార్హం. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును తొలగించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జుు అయ్యింది.

ఇదిలా ఉంటే అసలు ఈ కారు ఎవరిది..? పరారైన వ్యక్తి ఎవరు..? కారు ఎవరిపేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది..? కారు నడిపిందెవరు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.