హైదరాబాద్: హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఓ కారు పల్టీలు కొట్టి, బీభత్సం సృష్టించింది. అది మారుతీ రిట్జ్ కారు. మద్యం తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

మారుతీ రిట్జ్ కారును అతివేగంగా నడిపి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అందులో హైదరాబాద్ కోఠికి చెందిన ముగ్గురు  యువకులు ఉన్నారు. మద్యం సేవించి కారును  అతివేగంగా  నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.