Asianet News Telugu

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు..

కారు డ్రైవర్ మంటల్లో చిక్కుకు పోవడంతో అదే మార్గం నుండి వెళ్తున్న లారీ, ఆటో డ్రైవర్ గమనించి మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ను వెలికి తీసి 108 వాహనంలో సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. 

Car fires on Shamshabad Outer Ring Road - bsb
Author
Hyderabad, First Published Jul 22, 2021, 2:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. ఔటర్ రింగ్ రోడ్డు గుండా శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ఎయిర్ పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు ఇంజన్ లో నుండి మంటలు చెలరేగాయి. 

కారు డ్రైవర్ మంటల్లో చిక్కుకు పోవడంతో అదే మార్గం నుండి వెళ్తున్న లారీ, ఆటో డ్రైవర్ గమనించి మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ను వెలికి తీసి 108 వాహనంలో సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. 

గాయపడ్డ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొత్తుర్ మండలం తిమ్మాపూర్ కు చెందిన శ్రీకాంత్ గా పోలీసులు గుర్థించారు. శ్రీకాంత్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి అందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
Follow Us:
Download App:
  • android
  • ios