ఖమ్మం జిల్లాలో సోమవారం ఆర్టీసీ బస్సుకి తృటిలో ప్రమాదం తప్పింది.మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన బస్సు ఏన్కూరు బ్రిడ్జి వద్ద అదుపుతప్పడంతో  బ్రిడ్జి అంచుల్లో ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డైవర్... వాహనాన్ని పడిపోనీకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో బస్సులోని

 ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయలో బస్సులో 20మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కాగా... ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో... అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన తర్వాత బస్సులోని ప్రయాణికులను వేరే వాహనంలో తరలించారు