కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా మరణించిన ఘోర విషాదం ఇంకా మరచిపోకముందే తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.

కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా మరణించిన ఘోర విషాదం ఇంకా మరచిపోకముందే తెలంగాణలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.. యాదాద్రి భువనగిరి జిల్లాకు యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు ఈ రోజు నాగర్‌కర్నూలు జిల్లాలోని వట్టెంపాడు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ముందున్న రెండు చక్రాలు ఊడిపోయాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బస్సు వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బస్సు పక్కనున్న పొలాల్లొకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.. ప్రమాద సమయంలో బస్సులో 105 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలా మంది వీఆర్‌వో పరీక్షకు వెళుతున్న విద్యార్థులే. 

"