రంగారెడ్డి జిల్లా బొంగులూరులో విషాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌ కంప్రెజర్‌ పేలడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి దీపిక సజీవదహనమైంది. 

రంగారెడ్డి జిల్లా బొంగులూరులో విషాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌ కంప్రెజర్‌ పేలడంతో ఇంజినీరింగ్‌ విద్యార్థి దీపిక సజీవదహనమైంది. ఫ్రిజ్‌ డోర్‌ తీసేందుకు ప్రయత్నించిన సమయంలో పేలుడు జరిగింది. కంప్రెజర్‌ పేలుడుతో మంటలు అంటుకుని దీపిక అక్కడికక్కడే మృతి చెందింది.

ఫ్రిజ్ డోర్ ఎగిరి పక్కన పడిపోయింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించి.. విద్యార్థిని కి అంటుకున్నాయి. కాగా.. ఫ్రిజ్ ఎలా, ఎందుకు పేలిందనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. కూతురు ఇలా అకస్మాత్తుగా చనిపోవడాన్ని దీపిక తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.