హైదరాబాద్‌ జేఎన్టీయూలో మేఘనా రెడ్డి అనే బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగవ సంవత్సరం చదువుతోంది.

హైదరాబాద్‌ జేఎన్టీయూలో విద్యార్ధిని ఆత్మహత్య కలకలం రేపింది. సీఎస్సార్ బిల్డింగ్‌పై నుంచి దూకి మేఘనా రెడ్డి అనే విద్యార్దిని బలన్మరణానికి పాల్పడింది. మృతురాలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగవ సంవత్సరం చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే మేఘనారెడ్డి.. అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred