సూర్యపేట నియోజకవర్గం చివ్వేంల మండలంలోని  బీబీగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తరలి వచ్చారు

Jagadish Reddy: పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్న వారికి భరోసానివ్వడానికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఆత్మీయ సమ్మేళనాల వేదికగా రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్థం చేయడంతోపాటు ప్రజాసంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలను, మనోగతాలను పంచుకునేందుకే ఈ సమ్మేళనాలు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో దశలవారీగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 

గత వారం, పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా BRS ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు రాజకీయం గుప్పుమంటుంది. కానీ, రాజకీయ సభలకు భిన్నంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సూర్యపేట నియోజకవర్గం చివ్వేంల మండలంలోని బీబీగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం.. రాజకీయ కార్యక్రమంగా కాకుండా.. ఓ పెండ్లి వేడుకగా.. ఓ పండుగలా.. వనభోజన మహోత్సవంలా.. మరోలా చెప్పాలంటే ఓ జాతరలా సాగింది. ఈ సమ్మేళనంలో నిజంగానే ఆత్మీయ భావం పరిమళించింది.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మనవళ్లు,మనువారండ్రా తో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీష్ కూడా తన సతీమణి సునీతా రెడ్డి,తనయుడు వేమన్ రెడ్డితో హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి.. అల్పాహారం తీసుకున్నారు. ఈ సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కార్యకర్తలు కుటుంబాల వారిగా ఫోటోలు దిగారు. ఈ క్రమంలో చివ్వేంల, ఐలాపురం,అక్కలదేవి గూడెం,గాయం వారిగూడెం, యం జి నగర్ తాండా, మున్యా నాయక్ తాండా,పాండ్యానాయక్ తండా,రాజు తాండా,రోళ్లబండ తాండా,సూర్యనాయక్ తాండాలోని కార్యకర్తలు పాల్గొన్నారు.