Phone Tapping : భట్టి, ఉత్తమ్, పొంగులేటి ఫోన్లు ట్యాప్ ... రేవంత్ రెడ్డి పనే..: కేటీఆర్ సంచలనం

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తనపై వస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తిప్పికొట్టారు. నిజానికి ఇప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని... స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ ఈ పని చేయిస్తున్నారని ఆరోపించారు. 

BRS Leader KTR Reacts on Phone Tapping AKP

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కేసీఆర్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష నాయకులతో పాటు వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ముఖ్యంగా మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ పేరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో తాజాగా తెలుగు టీవీ ఛానల్ టివి9 కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత కేబినెట్ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసారు.  

ముందుగా తనపై చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని... కావాలనే తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తనకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని నిరూపించుకోడానికి ఎలాంటి టెస్టులకైనా సిద్దమేనని అన్నారు. బహిరంగ వేదికలపై లేదంటే గన్ పార్క్ వద్ద రాష్ట్ర ప్రజలందరి ముందు లై డిటెక్టర్ టెస్ట్ కు అయినా, నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అయినా సిద్దమేనని కేటీఆర్ తెలిపారు. 

బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సొంత మంత్రివర్గంలోని భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ఫోన్లను కూడా రేవంత్ ట్యాపింగ్ చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసారు. ఇక ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios