Congress leader Konda Surekha: ''పాలక భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయకులు బూటకపు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారిని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు'' అని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దేన‌నీ, కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్య‌క్తం చేశారు. తమ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆమె అన్నారు. 

Telangana Assembly Elections 2023: ''పాలక భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నాయకులు బూటకపు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారిని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు'' అని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దేన‌నీ, కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్య‌క్తం చేశారు. తమ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆమె అన్నారు.

గత ఐదేళ్లుగా వరంగల్ అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇంకా టిక్కెట్‌ ప్రకటించనప్పటికీ వరంగల్‌ ఈస్ట్‌ స్థానం అభ్య‌ర్థిగా కొండా సురేఖకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే కొండా సురేఖ మాట్లాడుతూ.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కంటే ఆస్తులు కూడబెట్టడమే సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు ప్రాధాన్యతనిస్తున్నార‌ని ఆరోపించారు. నగరంలోని రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల దయనీయ స్థితిని ప్రస్తావిస్తూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి జ‌రిగింద‌ని చెప్పారు. బీఆర్ఎస్ పాల‌న‌లో ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగ‌లేద‌ని విమ‌ర్శించారు.

మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత అనే కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు హామీలను గురించి ప్ర‌స్తావిస్తూ.. సామాన్యుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయడంతో పాటు ఆరు హామీల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆమె పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత అభివృద్దికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోని బీఆర్ఎస్ కు త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. కొండా కుటుంబం ప్రతి కార్యకర్తను ఆదుకుంటుంద‌నీ, ఇతర పార్టీలు ఆడుతున్న మాయలకు లొంగకుండా కాంగ్రెస్‌కు కట్టుబడి ఉండాలని సురేఖ కోరారు. కాంగ్రెస్ తోనే ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.