కుటుంబసభ్యులు బలవంతంగా చేస్తున్న పెళ్లిని ఆపేసి.. ప్రియుడిని చేరుకుంది. శుక్రవారం ప్రేమికులిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.
మండపంలో మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. వధువు పోలీసులకు పిలిచి ఆపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుడు.. పెళ్లికి వచ్చిన మరో అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అయితే.. పెళ్లి ఆపిన తర్వాత వధువు తన ప్రియుడి వద్దకు వెళ్లింది.
కుటుంబసభ్యులు బలవంతంగా చేస్తున్న పెళ్లిని ఆపేసి.. ప్రియుడిని చేరుకుంది. శుక్రవారం ప్రేమికులిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల గుండెపుడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్య వివాహాన్ని పెద్దల సమక్షంలో నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో గురువారం మరిపెడలో వివాహం జరుగుతున్న క్రమంలో వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి 100కు నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను ప్రేమించినట్లు చెప్పింది. దీంతో శుక్రవారం మహబూబాబాద్ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్ దండలు మార్చుకున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 26, 2020, 1:11 PM IST