కరీంనగర్ జిల్లాలో ఓ బాలుడి తల నీటి బిందెలో ఇరుక్కుపోయింది. జిల్లాలోని శంకరపట్నంకు చెందిన ఆరేళ్ల బాలుడు రోహిత్ ఆడుకుంటూ వెళ్లి బిందెలో తల పెట్టాడు. అయితే ఎంతకు తల బయటకు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

అతని ఏడుపు, కేకలు విన్న తల్లిదండ్రులు లోపలికి వచ్చి చూడగా.. బిందెలో చిన్నారి తల ఇరుక్కుపోయి కనిపించింది. దీంతో బాలుడి తలను బయటకు తీసేందుకు వారు నానా తంటాలు పడ్డారు.

ఎంతకు అది బయటకు రాకపోవడంతో స్థానికులు బిందెను కట్ చేసి చిన్నారిని రక్షించారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.