హైదరాబాద్ మణికొండలోని లాలమ్మ గార్డెన్‌లో భారీ శబ్ధంతో పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
హైదరాబాద్ మణికొండలో పేలుడు సంభవించింది. స్థానిక లాలమ్మ గార్డెన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే కెమికల్ డబ్బాల వల్లే పేలుడు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

