తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న ప్రముఖ పార్టీల్లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నారు. ఓ పార్టీలోంచి కీలక నాయకుల మరో పార్టీలోకి చేరుతుండటమే అందుకు కారణం. వివిద కారణాలతో పార్టీలను వీడుతున్న వారి వల్ల పార్టీల బలాబలాలు మారుతున్నాయి. ఇలా ఇప్పటివరకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలనుండి చాలామంది అసమ్మతులు పార్టీని వీడగా తాజాగా ఆ సెగ బిజెపి తాకింది. 

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యురాలు పోనుకోటి మల్లిక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్టీ బలోపేతం కోసం ఇస్తున్న నిర్మాణాత్మక ఆదేశాలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందువల్లే పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందని మల్లిక పేర్కొన్నారు.

తన రాజీనామాకు గల కారణాలను మల్లిక మీడియాకు వివరించారు. పార్టీ కోసం కష్టపడుతున్న మహిళా నాయకులకు సరైన గుర్తింపు లభించడంలేదన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పర్యాయాలు మురికివాడల అభివృద్ది కమిటీ కన్వీనర్ గా పనిచేసిన తన లాంటి సీనియర్ నాయకులను కూడా పార్టీ కార్యక్రమాల్లో పక్కన పెడుతున్నారని పేర్కొన్నారు. ఇలా మహిళలకు జరగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగానే పార్టీకి రాజీనామా చేసినట్లు మల్లిక వెల్లడించారు.