బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాలు: నేడు తెలంగాణపై కీలక ప్రకటన చేసే చాన్స్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్రించుకొని తెలంగాణపై బీజేపీ నాయకత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం కసఃర్తు చేస్తుంది. రాజకీయ తీర్మానం తర్వాత తెలంగాణపై బీజేపీ నేతలు ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ తెలంగాణ నేతలు చెబుతున్నారు.
హైదరాబాద్: BJP జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని Telanganaపై ఆ పార్టీ నేతలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ తరుణంలో బీజేపీ నాయకత్వం చేసే ప్రకటన ఏమిటనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది.
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నిలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తుంది.బీజేపీ National Executive Meetings కూడా హైద్రాబాద్ లో నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం కూడా ఇదేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నాయకత్వంతో పాటు క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఈ కార్యవర్గ సమావేశాలు దోహదపడుతాయనే అభిప్రాయంతో ఉన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 2న ప్రారంభమయ్యాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు JP Nadda ప్రారంభోపాన్యాసం చేశారు.జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా ప్రధాని Narendra Modiప్రసంగించారు. ప్రజల మధ్యే నిరంతరం ఉండాలని ప్రధాని మోడీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నెల 3న కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాజకీయ తీర్మానం తర్వాత తెలంగాణపై కూబా బీజేపీ నేతలు ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే బీజేపీ తెలంగాణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.ఈ సభలో కూడా కేసీఆర్ సర్కార్ పై బీజేపీ తన విమర్శల దాడిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. నిన్న కేసీఆర్ చేసిన విమర్శలను కూడా బహిరంగ సభ వేదికగా బీజేపీ తిప్పికొట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతుంది. 8 ఏళ్ల కాలంలో బీజేపీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో నిర్ణయించారు. మరో వైపు తెలంగాణలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా ప్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. అదే సమయంలో మోడీ సర్కార్ చేపట్టిన విధానాలను ప్రచారం చేయనున్నారు.
also read:భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రత్యేక పూజలు..
దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రజల నుండి వస్తున్న స్పందనను నేతలు పదాధికారుల సమావేశంలో ప్రస్తావించారు. మరో వైపు త్వరలో జరగనున్న గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో అను,సరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ఇవాళ రాజకీయ తీర్మాణంపై చర్చించనున్నారు. మరో వైపు తెలంగాణలో కూడా ఏ రకమైన వ్యూహాంతో వెళ్లాలనే దానిపై జాతీయ నాయకత్వం పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.ఈ సమావేశాలతో పాటు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయడంపై కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కేంద్రీకరించింది.