Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో బీసీ విద్యార్ధులకు మానసిక క్షోభ: బండి సంజయ్ ఫైర్

తెలంగాణ ప్రభుత్వం తీరుతో బీసీ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ తో పాటు, స్కాలర్ షిప్ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

BJP Telangana State President Bandi Sanjay serious comments on Kcr
Author
Hyderabad, First Published Jan 14, 2022, 5:33 PM IST


హైదరాబాద్:Telangana ప్రభుత్వం వ్యవహరంతో Bc విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని Bjp  రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ఆరోపించారు. శుక్రవారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్ధులకు  Fee రీ ఎంబర్స్ మెంట్, Scholarship లు చెల్లించలేదన్నారు.బీసీ విద్యార్ధులకు  రూ. 3 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించని కారణంగా బీసీ విద్యార్ధులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని సంజయ్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించని కారణంగా బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని బండి సంజయ్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో  ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు  ఎంత ఉంటే అంత ఫీజులను ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. 10 వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తున్నారన్నారు. 10 వేలకు పైగా ర్యాంకులు వచ్చిన వారికి మాత్రం కేవలం రూ.జ 35 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందని బండి సంజయ్ చెప్పారు.

ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.మరోవైపు ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నెంబర్ 18ని సవరించాలని బండి సంజయ్ కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న కార్యక్రమాలపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఒంటికాలిపై విమర్శలు చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంతో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత 317 జీవో అంశంపై బండి సంజయ్ దీక్షకు దిగిన అంశం కూడా రెండు పార్టీల మధ్య విమర్శలకు దారి తీసింది. తాజాగా బీసీ విద్యార్ధుల అంశంపై  కేసీఆర్ సర్కార్ పై  బండి సంజయ్ విమర్శలను గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోనేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై  బీజేపీ నిశితంగా విమర్శలు చేస్తోంది. ఎరువుల ధరల విషయమై ప్రధానికి కేసీఆర్ లేఖ రాయడంపై కూడా బండి సంజయ్ తప్పుబట్టారు. ఈ విషయమై గురువారం నాడు బండి సంజయ్ కేసీఆర్ పై మండిపడ్డారు. 

రాష్ట్రంలో రైతులకు ఎరువులను ఉచితంగా ఇస్తామంటూ 2017లో హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఐదేళ్లయినా దాన్ని అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. మాట తప్పినందుకు క్షమాపణలు అడిగి తలదించుకోవాలన్నారు. కానీ, సిగ్గు లేకుండా ఎరువుల ధరలపై ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఎరువుల కోసం రైతులు క్యూల్లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తుచేశారు. మోదీ సర్కారు వచ్చాక రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు అందుతున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు

Follow Us:
Download App:
  • android
  • ios