ఖమ్మం:  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. ఖమ్మం జిల్లాలోని వైరా మండల కేంద్రంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావు హత్యకు గురయ్యాడు. 

రామారావుపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

ఆర్టీఐ ద్వారా రామారావు ఉద్యమం చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలే రామారావు హత్యకు కారణమని భావిస్తున్నారు. నిందితుడిని రాజేష్ గా పోలీసులు గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.