హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

సోమవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను తొలుత కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించాడని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఈ చట్టాలను ఎందుకు సమర్ధిస్తున్నాడో చెప్పాలని ఆయన కోరారు.

నూతన వ్యవసాయచట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకొన్నారని ఆయన విమర్శించారు.  రానున్న రోజుల్లో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన రైతు వేదికను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని ఆయన సూచించారు. పంట కొనుగోళ్లతో రూ. 7500 కోట్ల నష్టం వచ్చిందని కేసీఆర్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. రైతులతో కేసీఆర్ ప్రభుత్వం వ్యాపారం చేసిందని ఆయన ఆరోపించారు.

వ్యవసాయ చట్టాలపై పెంచుకోవడానికి సీఎంకు చాలా సమయం పట్టిందన్నారు.