టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. అనంతరం ఈ వ్యవహారంపై వారు ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారు. 

టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర పెద్దలు పరిస్ధితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశాయి. ఈ సందర్భంగా ఆయనకు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్‌ను రేపు ఉదయం విచారించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు తెలిపింది. బీజేపీ నేత సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు.

ALso Read: హన్మకొండలో ఉద్రిక్తత: బండి సంజయ్‌ వాహనంపై చెప్పులు విసిరిన బీఆర్ఎస్

ఇదిలావుండగా.. తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌‌ను అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్‌ను ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 6 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసులో నిందితునిగా ప్రశాంత్.. బండి సంజయ్‌ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను పోలీసులు రిట్రీవ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నుంచి బండి సంజయ్‌కు పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. పేపర్ లీక్ జరగడానికి ముందు రోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంగళవారం రోజున బండి సంజయ్‌ను పేపర్ పంపిన తర్వాత కూడా ప్రశాంత్ ఆయన‌తో మాట్లాడినట్టుగా గుర్తించారు.