Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో హంగ్ వస్తుంది: ఎంపీ జీవీఎల్

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. అనేక నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ, బహుముఖ పోటీ ఉందని, చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. 
 

bjp mp gvl says hung in telangana elections
Author
Hyderabad, First Published Nov 30, 2018, 10:09 PM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. అనేక నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ, బహుముఖ పోటీ ఉందని, చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు గెలిచే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు. 

ఎవరి పట్ల హవా లేదని, నియోజకవర్గాల పరిస్థితులు మారినప్పుడు మాత్రమే ఇండిపెండెంట్లు ఇంత పెద్ద సంఖ్యలో గెలిచే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇండిపెండెంట్లు ఐదుగురు మించి గెలిచే అవకాశం లేదని తెలిపారు. 

ఒకవేళ తెలంగాణలో హంగ్ ఏర్పడితే తాము టీఆర్ఎస్ కు మద్దుతు ఇవ్వబోమని తేల్చిచెప్పారు జీవీఎల్. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే ఉన్నారని కొత్తగా కలిసేదేముందని వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబుతో కూడా కేసీఆర్ కలిసి ఉండాలనుకున్నవారేనని చెప్పారు. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే తప్పని చెప్పనని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios