ప్రత్యేక దేశంగా తెలంగాణ కావాలని కేసీఆర్ కోరుకొంటున్నారని బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు.  మంగళవారంనాడు హైద్రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్:Telangana ప్రత్యేక దేశం కావాలని KCR కోరుకొంటున్నట్టుగా ఆయన మాటలను బట్టి అర్ధమౌతోందని DK Aruna విమర్శించారు. 

BJP జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మంగళవారం నాడు హైద్రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు దేశభక్తి లేదన్నారు. ప్రధానమంత్రి Narendra Modi గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని డీకే అరుణ చెప్పారు.సర్జికల్ స్ట్రైక్స్ పై ఆధారాలు అడిగిన కేసీఆర్ సైనికుల ప్రాణ త్యాగాన్ని కూడా అవమానించారని డీకే అరుణ విమర్శించారు. 

తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకొన్న అమరవీరుల త్యాగాల పునాదిపైనే కేసీఆర్ సీఎం పదవిని చేపట్టారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారన్నారు.ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ సహా బీజేపీ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు.ఈ విషయమై కేసీఆర్ పై బీజేపీ నేతలు ప్రతి విమర్శలకు దిగారు. బీజేపీ నేతల కౌంటర్లకు టీఆర్ఎస్ ఎదురు దాడికి దిగింది.

కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాన మంత్రి జగదీష్ రెడ్డిలు ఇవాళ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

సీఎం KCR ను ముట్టుకుంటే కాలిపోతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి Jagadish Reddy హెచ్చరించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి Kishan Reddy వ్యాఖ్యలపై మంగళవారం నాడు జగదీష్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిలటరీ ఉందని కేసీఆర్ ను పట్టుకుపోతారా అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి స్వంతూరికి పోయినా కేసీఆర్ పాలన గురించి BJP చేసిన నష్టంపై ప్రజలు చెబుతారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చలకు కేసీఆర్ రావాలా అని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. 

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమైనా నిధులు తీసుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ అద్బుతమైన పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించిన విషయాన్ని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ పథకానికి నిధులు ఇవ్వాలని కూడా Niti Ayog సిఫారసులు చేసిందన్నారు. 

కానీ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వని విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల గురించి బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు., ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమి్ షా చేసిన అవమానం గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. 

విద్యుత్ సంస్కరణలను దొడ్డిదారిన అమలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలపై చట్టం తీసుకు రాకుండా పాలసీ విధానంగా అమలు చేస్తున్నారని తెలిపారు.చట్టం చేస్తే రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని భావించి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెట్టాలని కేంద్ర చెబుతుందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

అంతకు ముందు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏడేళ్లలో దేశానికి ఏం చేసిందో చెప్పడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ముందు అమరుల సాక్షిగా కేసీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ బహిరంగ సవాల్‌ను కేంద్రం తరపున తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.