రంగారెడ్డి జిల్లాలో చెకింగ్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నే గుద్దేసివెళ్లిపోయాడో బైకర్.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తొండుపల్లి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ బైక్ ముందు ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు పట్టుబడకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది.

"

ఆ బైక్ ను ఆపడానికి అటువైను వెడుతున్న కానిస్టేబుల్ వెంకటరమణను స్పీడ్ గా గుద్దేసి ఆపకుండా వెళ్లిపోయారు. అనుకోని ఈ ఘటనతో వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఆగకుండా వెళ్లిన బైక్ కోసం గాలిస్తున్నారు.  పోలీసులు కానిస్టేబుల్ వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో చిక్కింది. దీంతో దీని ఆధారంగా నిందితులను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.