హైదరాబాద్: రాష్ట్రంలో మూడు వారాల పాటు లాక్‌డౌన్ విధించాలని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రధాని నరేంద్ర మోడీకి సోమవారం నాడు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని ఆ లేఖలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కోటాను పెంచాలని ఆ లేఖలో కోరారు.

రాష్ట్రంలో వందల సంఖ్యలో మరణాలు నమోదౌతున్నాయని ఆయన చెప్పారు. కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు అందిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ కేంద్రానికి తప్పుడు సలహలిస్తున్నారని  ఆ లేఖలో వెంకట్ రెడ్డి విమర్శించారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 11 వతేదీన జరగనుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పై  చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ విధిస్తే  ఉత్పన్నమయ్యే పరిస్థితులపై కూడ చర్చించనున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్  విషయమై రేపటి కేబినెట్ సమావేశం తర్వాత కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.  కేసీఆర్క రోనా నుండి కోలుకొన్న తర్వాత  జరిగే తొలి మంత్రివర్గ సమావేశం .