తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ)లీడర్ పదవి కోసం రోజురోజుకు పోటీ పెరుగుతోంది. గతంలో సిఎల్పి లీడర్ గా పనిచేసిన జానారెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో ఎలాగూ తమ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పదవులుండవని భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ పదవితోనైనా సర్దుకుందామని భావిస్తున్నారు. దీంతో ఈ పదవిని తమకే కేటాయించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు డిల్లీ స్థాయిలో మంత్రాంగం జరుపుతున్నట్లు సమాచారం. 

తాజాగా ఈ పదవి తనకే కేటాయించాలంటూ భూపాలపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటరమణా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సీఎల్పా లీడర్ గా పనిచేసేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ అదిష్టానం తనకు అవకాశమిస్తే సమర్థవంతంగా పనిచేస్తానని గండ్ర తెలిపారు. 

అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్దిని మరిచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో పడిందని అన్నారు. ఎమ్మెల్సీల విషయంలో వీరు చేసిన ఆకర్ష్ ప్రస్తుతం  ఆకర్ష్ గా మారుతోందన్నారు. ఇకనైనా అధికార పార్టీ ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నించాలని గండ్ర సూచించారు.