కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం విలవిల్లాడిపోతోంది. పేద, ధనిక, సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా తన ముందు అందరూ సమానులే అన్నట్టుగా సోకుతుంది. ఇప్పటికే అనేకమంది ఈ వైరస్ బారినపడ్డారు. కొందరు మరణిస్తున్నారు కూడా. 

ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి మరణించి రెండు రోజులైనా గడవక ముందే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో రాజయ్య కరోనా వల్ల తీవ్ర జ్వరంతో బాధపడుతూ.... ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ రాజయ్య మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆయన వయసు 59 సంవత్సరాలు. ఆయన మృతిపట్ల పలువురు కమ్యూనిస్టు నాయకులూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.