నందిగామ: టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమర్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గెలుపును డబ్బుతో కొనాలని చూశారని ఆరోపించారు. అలాంటి వారిని ఎదిరించి మధిర పౌరుషాన్ని ప్రజలు నిలబెట్టారని భట్టి విక్రమార్క కొనియాడారు. 

కేసీఆర్ ఎన్నికలను కమర్సియల్‌గా మార్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కొద్ది మంది చేతుల్లో నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నలిగిపోతున్న తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తామని భట్టి విక్రమార్క అన్నారు.