Asianet News TeluguAsianet News Telugu

రాక్షసుని చేతుల్లో నుంచి తెలంగాణ విముక్తి చేయాలి.. కేసీఆర్ మీద బండి సంజయ్... !

పెద్దపల్లి జిల్లా మంథని బిజెపి సమరభేరీలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ సమరభేరి సభలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు  చంద్రుపట్ల రాంరెడ్డి  కుమారుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

bandi sanjay sensational comments on telangana cm kcr - bsb
Author
Hyderabad, First Published Apr 3, 2021, 1:26 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని బిజెపి సమరభేరీలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ సమరభేరి సభలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు  చంద్రుపట్ల రాంరెడ్డి  కుమారుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్కు సిగ్గుండాలి, సునీల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కుటుంబానికి బాడీ ని అప్పగించలేదు.
5 సంవత్సరాల నుండి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటలేను.. కేసీఆర్ దుర్మార్గపు చర్య వల్ల నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియోలో సునీల్ చెప్పాడు. సునీల్ మృతిపై సెల్ఫీ వీడియోను
మరణవాగ్మూలంగా తీసుకొని  కేసీఆర్ పై కేస్ పెట్టాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మృతదేహాన్ని కుటుంబానికి అందించకపోతే  ఫామ్ హౌస్ నుండి బయటకు ఎలా వస్తావో చూస్తాం అని హెచ్చరించారు. నిన్ను బయటకు గుంజుకు వచ్చే రోజులు ముందున్నాయి.. అని తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

మందు తాగి డ్రైవింగ్ చేస్తే తప్పు అయినప్పుడు, మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్పు కాదా అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మానికి ప్రతీక మంథని, కానీ నేడు నీ మాఫియాకు అడ్డాగా మారిందని దెప్పి పొడిచారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మంథని నియోజక వర్గానికి గానీ, రాష్ట్రంలోని ఏ ఒక్క ఎకరానికి గానీ నీళ్లు రాలేదు, కానీ ముఖ్యమంత్రి కుటుంబం కోట్లు దోచుకుంటున్నారు అని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు కోసం తెలంగాణ సాధించుకుంటే  రాక్షసపాలన సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకానికీ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా కూడా బీజేపీ ని అప్రతిష్ఠ పాలు జేస్తున్నారని,  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు 1500 కోట్లు, కేంద్రం ఇచ్చిందని అన్నారు.

గిరిజనులను హరితహారం పేరుతో, పోడు భూములు పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కేంద్రం ఎం ఇస్తలేదు అని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మాతో కలిసి రా.. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి  అడిగి నిధులు తీసుకు వద్దాం.. అని పిలుపునిచ్చారు.

నిజాం, నిరంకుశ ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకోసం, విద్యార్థుల కోసం, మహిళాల కోసం, పోరాటంచేసిన పార్టీ బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు, ఎక్కడా హిందువు అని చెప్పుకోలేదు. బైంసాలో హిందువులు పైన దాడి చేసి చిన్నపాపపై అత్యాచారం చేస్తే స్పందించని నీవు, రిపోర్టర్ ను కత్తులతో దాడి చేసిన బిజెపి పార్టీ ముందుండి వారి ప్రాణాలను కాపాడింది అన్నారు.  

నువ్వు హిందువు కాదా హిందువుల పై దాడులు జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ ఏ పార్టీకి మతనికి వ్యతిరేకం కాదు అని అన్నారు. ఇన్నిజరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించాడని ప్రశ్నించారు.

మెన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 80 శాతం మంది ప్రజలు వ్యతిరేకించారు. సంవత్సరం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి నిద్రలేకుండా చేసిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. జెండాలను పక్కనపెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం.. రాక్షసుని చేతుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయండి అని కోరుకుంటున్నా.. అన్నారు.

గోదావరిజలాలు వినియోగం కోసం సస్యశ్యామల యాత్ర చేశారు ఆనాటి బీజేపీ నేతలు. ప్రజాస్వామ్య మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ పోరాటం చేస్తుంది. హై కోర్ట్ న్యాయవాదులు వామన్ రావు జంట హత్య కేసులో కొంతమంది పోలీసు  అధికారుల పాత్ర ఉందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.

మంథనిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేదించకూడదని.. పోలీసులకు ఏ ఆపద వచ్చినా బిజెపి పార్టీ ఆదుకుంటుందని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
ఈ సమరభేరి సభలో మాజీ ఎంపీ  బిజెపి పార్టీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios