ఎవరు ఎక్కడ పోటీ చేయాలో పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుబు బండి సంజయ్ చెప్పారు. జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు తాము నడుచుకొంటామని ఆయన చెప్పారు.

హైదరాబాద్: ఎవరు ఎక్కడ పోటీ చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ మాదిరిగా తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదన్నారు. జాతీయ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. 

కరీంనగర్ లో మంత్రి Gangula Kamalakar పై పోటీ చేసి విజయం సాధించాలని మంత్రి KTR గురువారం నాడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు.ఈ సవాల్ పై Bandi Sanjay శుక్రవారం నాడు స్పందించారు. ఇవాళ ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం ప్రకారంగానే ఎవరైనా నడుచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. ఒక్కసారి నిర్ణయం తీసుకొన్నాక దానికి కట్టుబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ వివరించారు. జాతీయ నాయకత్వం నిర్ణయం ప్రకారంగానే బండి సంజయ్ కానీ, ఇంకా మరేవరైనా నేత కానీ పోటీ చేయాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని కేంద్రంపై TRS చేసిన విమర్శలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. నిన్న మంత్రి కేటీఆర్ చేసిన ప్రారంభోత్సవాలకు నిధులను ఎవరిచ్చారని బండి సంజయ్ ప్రశ్నించారు.ఏది మాట్లాడినా ప్రజలు సహిస్తారనే భ్రమల నుండి టీఆర్ఎస్ నేతలు బయటకు రావాలని ఆయన సూచించారు. 

గత కొంత కాలంగా టీఆర్ఎస్ పై , కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తుంది.

కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని కూడా విమర్శలు చేస్తున్నాు.ఈ విమర్శలకు బీజేపీ కూడా కౌంటర్ ఇస్తోంది. నిన్న కరీంనగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సమయంలో కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదని వమర్శలు చేశారు కేటీఆర్. ఈ క్రమంలోనే బండి సంజయ్ కరీంనగర్ నుండి విజయం సాధించి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.

కరీంనగర్ నుండి గాలిలో బండి సంజయ్ విజయం సాధించారన్నారు. అంతకు ముందు కమలాకర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యాడన్నారు. మరోసారి కమలాకర్ పై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు కేటీఆర్. అలా చేస్తే కమలాకర్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలను ఇవాళ మీడియా పరతినిధులు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ సమాధానమిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికార పార్టీపై దూకుడుగా విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలను బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. 

బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించడానని బీజేపీ తప్పుబడుతుంది. ఇదే విషయమై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం స్పీకర్ దే తుది నిర్ణయమని ప్రకటించింది.