ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సామాజికవేత్త బాలసాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ విరించి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ఆధ్యాత్మిక భోదనలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజును నోటీ నుంచి శివలింగాలు తీస్తూ.. ఆయన వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న శిష్యులు, భక్తులు విషాదంలో మునిగిపోయారు.