సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మహాకూటమి తరుపున తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ప్రచార షెడ్యూల్ ని కూడా ఖరారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజులపాటు.. బాలకృష్ణ ప్రచారం సాగనుంది.

నవంబర్ 30వ తేదీ నుంచి మొదలై.. డిసెంబర్ 4వ తేదీ వరకు ప్రచారం కొనసాగుతుంది. నవంబర్ 30న కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. డిసెంబర్ 1న శేరిలింగంపల్లి, డిసెంబర్ 2న ఖమ్మం, సత్తుపల్లి, ఆశ్వరావుపేట నియోజకవర్గాల్లో బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 3న మహబూబ్‌నగర్, మక్తల్, 4న రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, సనత్‌నగర్ అభ్యర్థుల తరుపున బాలయ్య ప్రచారం చేయనున్నారు.

ఇటీవల టీటీడీపీ నేత ఎల్. రమణ.. బాలకృష్ణని కలిసి.. మహాకూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఆయన కోరిక మేరకు ప్రచారానికి బాలయ్య అంగీకరించారు. 

read more news

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే