అమ్మాయిలకు లైటింగ్ కొట్టేవాడిని సీఎం చేసారు..: రేవంత్ పై జడ్సన్ షాకింగ్ కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ కాంగ్రెెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేసారు.  ఆయన ఎలాంటివాడో తెలుసా..?  ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సీఎంను చేసిన కాంగ్రెస్ పై జాలి వేస్తోందన్నారు.

Bakka Judson Shocking Remarks on Telangana CM Revanth Reddy AKP

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నిరుద్యోగుల ఆందోళనలపై ఇటీవల సీఎం చేసిన కామెంట్స్ కు  ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జడ్సన్ కౌంటర్ ఇచ్చారు. కాలేజీల వద్ద అమ్మాయిలకు లైంటింగ్ కొట్టేవాడిని తీసుకువచ్చి ముఖ్యమంత్రి చేస్తే ఇలాగే వుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశాభివృద్ది, అవినీతి గురించి మాట్లాడే కాంగ్రెస్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ముద్దాయిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసారంటూ చాలా ఘాటు కామెంట్స్ చేసారు జడ్సన్. 

రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీలో లేనందుకు సంతోష పడుతున్నానని జడ్సన్ అన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిని  అదిరోహించాక అయినా రేవంత్ మారతాడని అనుకున్నాను... కానీ కుక్క తోక వంకర  అన్నట్లుగానే పరిస్థితి వుందన్నారు. రేవంత్ ను సీఎం చేసిన కాంగ్రెస్ జాలి వేస్తోందన్నారు. ఇదే పార్టీలో వుంటే తానుకూడా విలన్ అయ్యేవాడినని... ఇప్పుడే బాగుందని జడ్సన్ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి గత 34 ఏళ్ళుగా సేవ చేసినట్లు బక్క జడ్సన్ పేర్కొన్నారు. తాను మిగతా నాయకుల్లా జంపింగ్ బ్యాచ్ కాదు... గాంధీజి ఆశ్రమంలో చరఖా చుట్టిన బ్యాచ్ అని అన్నారు. కాంగ్రెస్ అదిష్టానంతో కలిసి పార్టీ బలోపేతానికి పనిచేసానని అన్నారు. కానీ ఇప్పుడు ఒరిజన్ కాంగ్రెస్ పార్టీని చంపేసారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై జడ్సన్ ఫైర్ అయ్యారు. 

గతంలోనూ ఇలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలపై జడ్సన్ అవినీతి ఆరోపణలు చేయడంతో ఆయనను పార్టీనుండి సస్పెండ్ చేసారు. అసలైన కాంగ్రెస్ నాయకులకు కాకుండా వేరే పార్టీల నుండి వచ్చినవారికే ప్రాధాన్యత లభిస్తోందని... ఎంపీ టికెట్లు అలాంటివారికే దక్కాయంటూ లోక్ సభ ఎన్నికల వేళ జడ్సన్ ఆరోపించారు. దీంతో క్రమశిక్షణా చర్యలకింద ఆయనను సస్పెండ్ చేసారు.  

ఇలా పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యాక జడ్సన్ మరింత దూకుడుగా ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించారు. ఇటీవల నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష కూడా చేసారు. ఈ క్రమంలోనే ఆయన నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ సీఎంపై సంచలనం వ్యాఖ్యలు చేసారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios