అయోధ్య : సీతమ్మ తల్లికి బంగారు చీర.. సిరిసిల్ల చేనేత కారుడి అపురూప కానుక...
అయోధ్య రామాలయానికి పంపడం కోసం సిరిసిల్ల చేనేత కారుడు అద్భుతమైన బంగారు చీరను నేశారు.
సిరిసిల్ల : అయోధ్య రామాలయానికి కానుకగా తెలంగాణలోని సిరిసిల్ల చేనేతకారుడు అపురూప కానుకను సిద్ధం చేశారు. సీతమ్మ తల్లికోసం బంగారు చేనేత చీరను సిద్ధం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికుడు వెళ్ది హరిప్రసాద్ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. దీనికోసం బంగారు తీగతో మగ్గంపై రామాయణ ఇతివృత్తాలు దృశ్యాల రూపంలో కనిపించేట్టు గా చీర నేశారు.
ఈ చీరకోసం రూ. లక్షన్నర ఖర్చుపెట్టారు హరిప్రసాద్. భార్యాభర్తలిద్దరూ కలిసి 20 రోజులపాటు శ్రమించి ఈ చీరను నేసామని తెలిపారు. చీరమీద
అయోధ్య రాముడి గుడి వచ్చేలా చీరను సృష్టించారు. ఈ బంగారు పట్టుచీరపై రామాయణ ఘట్టాలతో చీరనేశారు. ఈ చీర నేతలో బంగారాన్ని వాడారు. చీరను ఎప్పుడైనా తీసినా దాంట్లో నుంచి ఎనిమిది గ్రాముల బంగారం వస్తుందని తెలిపారు. ఈ చీర బరువు 900 గ్రాములు ఉంటుంది.
ఈ చీరను శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తో ఓపెన్ చేయించారు ఈ నెల 26 న భారత ప్రధాని నరేంద్రమోదీని కలిసి.. ఈ చీరను చూపించబోతున్నట్లుగా హరిప్రసాద్ తెలిపారు.
- Ayodhya
- Ayodhya Ram Mandir
- Ayodhya Ram Mandir event
- Ayodhya Ram Temple
- Ayodhya Ram Temple inauguration
- Ayodhya Ram Temple opening date
- Ayodhya Ram Temple specialities
- Ayodhya Temple
- Golden saree
- Holy Ayodhya
- Holy Ayodhya app
- Ram Mandir
- Ram Mandir inauguration
- Sircilla handloom weaver
- Sri Rama Janmabhoomi
- Temple trust
- Vishwa Hindu Parishad
- acred ceremony
- auspicious event
- ceremony details
- consecration ceremony
- contributors
- historical insights
- ram mandir
- ram temple trust
- sacred ritual
- telangana