ఓ ఆటో డ్రైవర్ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. తన ఆటో ఎక్కిన ప్రయాణికుడితో కలిసి మహిళ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన  కొత్త గూడెం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పినపాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కరకుగూడెం మండలంలోని తన పుట్టింటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం ఎడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. 

ఈ క్రమంలో రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రాగానే ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఓ చోట వాహనాన్ని ఆపి వివాహితను చిత్రహంసలు పెడుతూ అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.