చేతబడి చేయిస్తున్నారనే నెపంతో ఖమ్మం జిల్లా మథిర ఎస్సీ కాలనీలో వృద్ధ దంపతులపై స్థానికులు దాడి చేశారు. వృద్ద దంపతుల పట్ల రెండు రోజుల పాటు అతి అమానుషంగా వ్యవహరించారు.

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా మథిర కాలనీలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో వృద్ధ దంపతులపై స్థానికులు దాడికి దిగారు. భర్త చేత బలవంతంగా భార్య పన్ను పీకించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఖమ్మం జిల్లా మధతిర కళామందిర్ రోడ్డులో దంపతులు గద్దల మోహన్ రావు (75), గద్దల సరోజిని (68) నివాసం ఉంటున్నారు. వారి మనవుడ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపపడుతున్నాడు. దీంతో వారు పెనుగంచిప్రోలులోని ఓ పూజారిని కలిశారు. ఇంటి వద్ద పూజ నిర్వహించాలని అతను చెప్పాడు.

దాంతో మోహన్ రావు దంపతులు చేతబడి చేయిస్తున్నారనే అనుమానంతో అదే కాలనీకి చెందిన ఓ కుటుంబం వారిపై దాడి చేసింది. రెండు రోజులుగా వారిపై దాడులు చేస్తూ వస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.