తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట కి సమీపంలో ఓ హెలికాప్టర్ కూలింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద ఈ హెలికాప్టర్ కూలింది. ఇది ఆర్మీ హెలికాప్టర్ గా అధికారులు గుర్తించారు.

కూలిన వెంటనే హెలికాప్టర్ కాలి బూడిదయ్యింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో పైలెట్ ఇక్కడే ఉన్నారు.  హెలికాప్టర్ కూలుతుందన్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన పైలెట్.. ప్యారచూట్ సహాయంతో వెంటనే కిందకి దూకేశారు.

దీంతో.. ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. పైలెట్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్‌గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే ఆర్మీ వైద్యులు మరో హెలికాఫ్టర్‌లో ప్రమాదస్థలికి చేరుకుని పైలెట్‌కు వైద్యం అందజేశారు.