ఎన్నికల కోసమే సాగు చట్టాలు రద్దు చేశారా ?- ట్విటర్ మంత్రి కేటీఆర్
ఎన్నికల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిందేమో అని మంత్రి కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి వ్యాఖ్యలు చూస్తేంటే అలాగే ఉందని అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఎన్నికల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసిందా అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. శనివారం సాయంత్ర ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే తనకు అలాగే అనిపిస్తోందని అన్నారు. పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని రైతులకు క్షమాణలు చెప్పారేమో అని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంభించే పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. ఎన్నికల బీజేపీ కొత్త విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని, మళ్లీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వాటిని తిరిగి తీసుకొస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
విజృంభణ వేళ కలకలం... మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్
రైతు చట్టాల రద్దు కోసం సుదీర్ఘమైన పోరాటం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుదీర్ఘకాలం పాటు ఉద్యమం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని 2020 ఆగస్టు నెల నుంచి శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఆ పోరాటం 2021 డిసెంబర్ 15వరకు సాగింది. ఈ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు ఈ పోరాటంలో అసువులుబాసారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. అదరకుండా, బెదరకుండా ఉద్యమం కొనసాగించారు. ఈ నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న లఖింపూర్ ఖేరీ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిరసలు తెలుపుతున్న రైతులపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనపై ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తోంది. పార్లమెంట్లులో లఖీంపూర్ ఘటన విషయంలో ప్రతిపక్షపార్టీలు నిరసనలు తెలిపాయి. ఆందోళనలు చేశాయి.
వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో కాల్పులు: ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మృతి, మరొకరికి గాయాలు
నిరసనలు ఆపాలని ప్రభుత్వం ఎన్నో సార్లు విన్నవించినా..రైతులు ఆందోళనలు కొనసాగించారు. సాగు చట్టాలు రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. సుధీర్ఘ కాలం పాటు జరిగిన ఉద్యమం, రైతుల తెగింపు చూసి చివరికి ప్రభుత్వం దిగి వచ్చింది. కొత్త సాగు చట్టాలు రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఈ విషయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. రైతుల మంచి కోసమే నూతన చట్టాలు తీసుకొచ్చామని అన్నారు. కానీ చట్టాల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించలేకపోయామని అన్నారు. రైతులకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజుల్లోనే చట్టాలను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్ సభలో, రాజసభలో ఆమోదింపజేసుకుంది. దీంతో రైతులు ఉద్యమం నిలిపివేశారు. తరువాత కేంద్ర ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపి పలు హామీలు ఇచ్చింది. రైతులపై ఉన్న కేసులన్నీ తొలగిస్తామని చెప్పింది. ఉద్యమ సమయంలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పంజాబ్, హర్యాన ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాయని తెలిపింది. అలాగే కనీస మద్దతు ధర కోసం కమిటీని వేస్తున్నట్టు తెలిపింది. దీంతో రైతులంతా నిరసనలు విరమించి ఇంటింకి వెళ్లిపోయారు. డిసెంబర్ 15వ తేదీన విక్టరీ ర్యాలీ నిర్వహించింది.