ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల పరస్పర ఒప్పందంలో భాగంగా భవనాల అప్పగింత కార్యక్రమం కొనసాగుతోంది. విభజన సమయంలో ఏపీ కార్యాలయాల కోసం ఇచ్చిన భవంతులను తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది ఏపీ ప్రభుత్వం.

హైదరాబాద్‌లోని హెర్మెటేజ్ బిల్డిండ్ , పోలీస్ హెడ్ క్వార్టర్స్ సహా పలు భవనాలను టీఎస్ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లను ఏపీ అధికారులు వాడుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు ఎర్ర మంజిల్‌లో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అసెంబ్లీని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. దీని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 27వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.