ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుండి ఇంరట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలతో రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు
హైదరాబాద్: Andhra Pradesh , Telangana రాష్ట్రాల్లో శుక్రవారం నాడు Inter పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షలకు రెండు రాష్ట్రాల అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. రేపు సెకండియర్ పరీక్షలు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 1443 Exam కేంద్రాల్లో 9.07 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఇంటర్ పరీక్షా కేంద్రంలోకి విద్యార్ధులను అనుమతించబోమని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు.
గత ఏడాది నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ లో 51 శాతం మంది Students ఫెయిలయ్యారు. ఫెయిలైన విద్యార్ధులను ప్రభుత్వం పాస్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ విద్యార్ధులు సెకండియర్ లో ఉన్నారు. సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ పరీక్షలకు సంబంధించి ఇంఫ్రూవ్ మెంట్ రాసుకొనే వెసులుబాటును కల్పించింది. ఇంఫ్రూవ్ మెంట్ రాసిన విద్యార్ధులకు ఎక్కువగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు. నెల రోజుల్లోపుగానే పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇక ఏపీ రాష్ట్రంలో ఇవాళ్టి నుండి ఈ నెల 24వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ , సెకండియర్ కలిపి 9 లక్షల 14 వేల 423 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.ఓకేషనల్ కోర్సు చేసే విద్యార్ధులు 87,435 మంది విద్యార్ధులు కూడా పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ విద్యార్ధులు పరీక్షలు రాసేందుకు వీలుగా రాష్ట్రంలో 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ రాస్ట్రంలో కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న టెన్త్ పరీక్షల్లో పేపర్ల Leakage వ్యవహరం కలకలం రేపుతుంది.
ప్రతి రోజూ ఏదో ఒక చోట పేపర్లు లీకౌతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.ఈ విషయమై ఏపీ సీఎం YS Jaganనిన్న తిరుపతిలో జరిగిన సభలో Chandrababu Naidu పై విమర్శలు గుప్పించారు. నారాయణ, శ్రీచైతన్య స్కూల్స్ నుండి పేపర్లు లీకయ్యాయన్నారు. నారాయణ విద్యా సంస్థలు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణకి చెందిందని ఆయన గుర్తు చేశారు. పేపర్లు బయటకు వచ్చేలా చేస్తూ పేపర్లు లీకయ్యాయయని గగ్గోలు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటరిచ్చారు. పపర్లు లీక్ కావాలని ఎవరైనా కోరుకొంటారా అని ప్రశ్నించారు. పేపర్లు లీక్ చేయాలని ఎవరైనా చేస్తారా అని అడిగారు. టెన్త్ పరీక్షలు సరిగా నిర్వహించలేని మంత్రి బొత్స సత్యనారాయణపై చంద్రబాబు నిన్న విశాఖలో జరిగిన నిరసన కార్యక్రమంలో మండిపడ్డారు.