మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు:తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

టెన్త్  క్లాస్  ప్రశ్నా పత్రాల  లీకేజీ కేసులో  చిత్తూరు  కోర్టు తీర్పును సవాల్  చేస్తూ  మాజీ  మంత్రి నారాయణ  దాఖలు  చేసిన  పిటిషన్ పై తీర్పును ఏపీ  హైకోర్టు రిజర్వ్  చేసింది.

AP High Court Reserved Former Minister Narayana Bail Cancel Petition

హైదరాబాద్:టెన్త్  క్లాస్ ప్రశ్నాపత్రాల  లీకేజీ కేసులో చిత్తూరు కోర్టు  తీర్పును సవాల్  చేస్తూ  మాజీ  మంత్రి నారాయణ దాఖలు  చేసిన  పిటిషన్ పై  తీర్పును ఏపీ హైకోర్టురిజర్వ్ చేసింది. అయితే తీర్పు వచ్చేవరకు   చిత్తూరు కోర్టు ఆదేశాలను నిలిపివేయాలని ఆదేశించింది హైకోర్టు. టెన్త్  ప్రశ్నాపత్రాల   లీకేజీ కేసులో  బెయిల్  ను  రద్దు చేస్తూ  చిత్తూరు సెషన్స్  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 30న లొంగిపోవాలని చిత్తూరు  కోర్టు  మాజీ  మంత్రి నారాయణను ఆదేశించింది. చిత్తూరు సెషన్స్  కోర్టు ఆదేశాలను  ఏపీ హైకోర్టులో  మాజీ  మంత్రి నారాయణ  సవాల్  చేశారు. ఈ  విషయమై ఇరువర్గాల  వాదనలను విన్న  హైకోర్టు తీర్పును రిజర్వ్  చేసింది.  నారాయణ తరపున లాయర్లు  సిద్దార్ధ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు విన్పించారు. ఏపీ  ప్రభుత్వం  తరపున  అడిషనల్  అడ్వకేట్  జనరల్ వాదించారు. 

ఈ  ఏడాది  ఏప్రిల్  27న  చిత్తూరు జిల్లా గంగాధర  నెల్లూర మండలం నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్  హై స్కూల్ లో తెలుగు  ప్రశ్నాపత్రం లీకైంది. ఈ కేసులో  నారాయణ విద్యాసంస్థల పాత్ర ఉందని చిత్తూరు పోలీసులు అరెస్ట్  చేశారు.  నారాయణ విద్యాసంస్థలకు  తనకు సంబంధం లేదని మాజీ మంత్రి నారాయణ  ప్రకటించారు. 2014లోనే తాను నారాయణ విద్యా సంస్థలకు  రాజీనామా చేసినట్టుగా   నారాయణ  ప్రకటించారు. పక్కా పథకం ప్రకారంగానే  ప్రశ్నపత్రం లీకైందని  పోలీసులు అప్పట్లో  ప్రకటించారు.ఈ  కేసులో  హైద్రాబాద్ లో మాజీ  మంత్రి నారాయణను  చిత్తూరు పోలీసులు అరెస్ట్  చేశారు. హైద్రాబాద్ నుండి  చిత్తూరు జిల్లాకు తరలించారు. 

also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసు: మాజీ మంత్రి నారాయణను విచారిస్తున్న ఏపీ సీఐడీ

ఈ  కేసులో  మాజీ  మంత్రి నారాయణకు ఈ ఏడాది మే 11న  కోర్టు  బెయిల్  మంజూరు చేసింది. అయితే ఈ  బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ  పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో  చిత్తూరు సెషన్స్ కోర్టు  బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోపుగా  పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై నారాయణ కోర్టును ఆశ్రయించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios