Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నీళ్లు తీసుపోవడం కాదు తీసుకొచ్చాను....: చంద్రబాబు

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు దేశం జాతీయాద్యక్షులు చంద్రబాబు శేరిలింగంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. టిడిపి అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ తో కలిసి నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా జంద్రబాబు శేరిలింగంపల్లి ప్రజలనుద్దేశించి రోడ్ షో లో ప్రసంగించారు. 
 

ap cm chandrababu speech at serilingampally
Author
Serilingampally, First Published Nov 29, 2018, 2:28 PM IST

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు దేశం జాతీయాద్యక్షులు చంద్రబాబు శేరిలింగంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. టిడిపి అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ తో కలిసి నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా జంద్రబాబు శేరిలింగంపల్లి ప్రజలనుద్దేశించి రోడ్ షో లో ప్రసంగించారు. 

మహాకూటమి అధికాంరలోకి వస్తే తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడి నీళ్లను ఆంధ్రాకు తరలించుకుపోతానని  టీఆర్ఎస్ అసత్యపు ప్రచారం చేస్తోందని చంద్రబాబు అన్నారు. తాను నీళ్లు తీసుకెళ్లడం కాదు తెలంగాణకు నీళ్లు తీసుకువచ్చానని వివరించారు. తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. 

కేసీఆర్ రాష్ట్రంలో ఏమీ పనులు చేయలేదు కాబట్టి నన్ను తిట్టి ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలతో దొంగాట ఆడుతున్నాయన్నారు. ముందే వారు మాట్లాడుకోవడం వల్లే తెలంగాణ అసెంబ్లీ రద్దు రెండు మూడు రోజుల్లో జరిగిపోయిందన్నారు. గవర్నర్ కూడా బిజెపి ఆదేశాలతోనే వెంటనే అనుమతిచ్చారన్నారు. ఇప్పుడు మరో నాటకానికి తెర తీశారని...బిజెపి కొట్టినట్లు నటించగా టీఆర్ఎస్ ఏడ్చినట్లు నటిస్తోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.  

తెలంగాణ ఆశయ సాధన  కోసమే మహాకూటమి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. తమ కూటమి గెలిచాక ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇళ్లు  కట్టిస్తామని ఇప్పటికే హామి ఇచ్చామన్నారు. లోటు రాష్ట్రం ఎపిలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని...కానీ ధనిక రాష్ట్రం తెలంగాణ ఎందుకు జరగడం లేదని  చంద్రబాబు ప్రశ్నించారు. 

కేవలం నన్ను విమర్శించాలంటేనే కేసీఆర్ బైటికి వస్తారని మిగతా సపయాల్లో ఆయనసలు బైటికి రావడమే అరుదని చంద్రబాబు అన్నారు. దేశంలో ప్రస్తుతం రెండె రెండు ప్రంట్ లు ఉన్నాయని...ఒకటి బిజెపిదయితే రెండోది బిజేపి వ్యతిరేక ప్రంట్. కేసీఆర్ ఏ ప్రంట్ లో ఉంటారో చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు.  ఐటీఐఆర్, ట్రైబల్ యూనివర్సిటీల గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నిచడంలేదని అడిగారు. 

శేరిలింగంపల్లి  అభ్యర్థిని భవ్య ఆనంద ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికలు వీకెండ్ లో వస్తున్నాయి కదా అని ఓటేయకుండా ఎక్కడికైనా  వెళితే మళ్లీ అన్యాయం జరుగుతుందన్నారు. వీకెండ్లు మళ్లీ చాలా వస్తాయి కానీ ఎన్నికలు రావని అన్నారు. చదువుకున్న మీరే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి చంద్రబాబు సూచించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios