ఖమ్మం: తెలంగాణ ఎన్నికల పోరులో అధికార ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో పొందుపరిచింది తానేనని చంద్రబా సైబరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ తన మానసిక పుత్రిక అంటూ చెప్పుకొస్తున్నారు.

అటు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు గులాబీబాస్, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ను చంద్రబాబు నిర్మిస్తే మరి ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారు. కులీబ్ కుతుబ్ షా బతికి ఉంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు విని ఆత్మహత్య చేసుకునేవాడని పదేపదే విమర్శిస్తున్నారు. 

కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివరించారు. హైదరాబాద్ నిర్మించింది తానేనని ఎప్పుడూ అనలేదన్నారు. సైబరాబాద్ నిర్మించింది తానేనని చెప్పుకొచ్చారు.

ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన వారి జాబితాలో తనదే మెదటి పేరు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సైబరాబాద్ నిర్మాణానికి తానే  కర్తకర్మ క్రియ అన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

అంతేకానీ తానే హైదరాబాద్ నిర్మించానని కేసీఆర్ బహిరంగ సభలలో పదేపదే చేప్తున్నారని అలాంటి వ్యాఖ్యలు తాను చెయ్యలేదని తెలంగాణ ప్రజలకు చంద్రబాబు వివరణ ఇచ్చారు.