Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సీఎం కేసీఆర్ కు అభినందనలు: చంద్రబాబు

 తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న గులాబీ దళపతి కేసీఆర్ కు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 

ap cm chandrababu naidu best wishes to ts cm kcr
Author
Hyderabad, First Published Dec 11, 2018, 3:11 PM IST

అమరావతి: తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న గులాబీ దళపతి కేసీఆర్ కు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణలో ప్రజల తీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యులందరికీ చంద్రబాబు అభినందనలు ప్రకటించారు. 

అయితే దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గత 5ఏళ్లలో జరిగిన అనేక ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా, ఇప్పుడు తాజాగా జరిగిన 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పూర్తిగా బలహీనపడిందని వ్యాఖ్యానించారు. 


బిజెపి పాలన పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని గత 5ఏళ్లలో బిజెపి చేసిందేమీ లేదనేది అన్నివర్గాల ప్రజలు గుర్తించారని చంద్రబాబు ప్రకటనలో తెలిపారు. 

ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని బిజెపికి వ్యతిరేకంగా తాము ఏర్పాటు చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉంటారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు 5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదపడతాయన్నారు.    

చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో విజేతలుగా నిలచిన ప్రతీ ఒక్కరికి లోకేష్ అభినందనలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios