హైదరాబాద్‌లో ర్యాష్ డ్రైవింగ్‌లు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం శాలిబండ వద్ద జరిగిన ఘటనను మరిచిపోకముందే ఆదివారం మరో ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ వద్ద మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి తన కారుతో ఆటోను ఢీకొట్టాడు

హైదరాబాద్‌లో ర్యాష్ డ్రైవింగ్‌లు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం శాలిబండ వద్ద జరిగిన ఘటనను మరిచిపోకముందే ఆదివారం మరో ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ వద్ద మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి తన కారుతో ఆటోను ఢీకొట్టాడు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో ఎగిరిపోయి ఫుట్‌పాత్‌పై పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:బిచ్చగత్తెను ఢీ కొట్టి.. పారిపోయే యత్నంలో జనంపైకి కారు: పాతబస్తీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు

దీంతో కారును వదిలి అందులోని యువకులు పారిపోయారు. ఇదే సమయంలో కారు నడిపినవారిని కాకుండా మరొకరిని పోలీసులకు అప్పగించారు కారు యజమాని. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడు ఉమేశ్ కుమార్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు.