TRS Party: తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీతో పురుడు పోసుకొబోతుంది. 

TRS Party: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకొకున్నది. తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవం కానున్నది. తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో కొత్త రాజకీయ పార్టీ రిజిష్టర్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వెళ్ళింది. 

సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాల రంగం అధ్యక్షుడిగా ఈ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి కేంద్రం ఎన్నికల సంఘానికి దరఖాస్తు పంపినట్టు సమాచారం. ఈ పార్టీ కార్యాలయాన్ని ఓల్డ్ అల్వాల్ లో ఏర్పాటు చేసినట్టు దరఖాస్తులో పేర్కొన్నారట. ఈ పార్టీ ఉపాధ్యక్షులుగా తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా సదుపల్లి రాజు వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బీఆర్ఎస్ గా మారిపోయింది. దాంతో టీఆర్ఎస్ అనే పార్టీ పేరు తెలంగాణలో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి బదులుగా టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ వచ్చేలా తెలంగాణ రాజ్య సమితితో పాటు తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రైతు సమాఖ్య లాంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలో ఉన్న తెలంగాణవాదులు టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.