హైదరాబాద్: యాంకర్ సుమ శుక్రవారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించినందుకు ఆమె కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. 

ఓ మంచి పని కోసం తాను కేటీఆర్ ను కలిసినట్లు సుమ తెలిపారు. ఆ మంచి పనేమిటో ఆమె చెప్పడానికి నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలూ చెబుతానని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఆమె కేటీఆర్ ను కలిశారు.

రామ్ చరణ్ తేజ్ నటించి వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సుమ యాంకర్ గా వ్యవహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో కేటీఆర్ ను సుమ ప్రశంసలతో ముంచెత్తారు.