హైదరాబాద్:తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ఎం సీతారాం రెడ్డి పై ఘన విజయం సాధించారు. 

మెుదటి రౌండ్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఆధిక్యత కనబరుస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరులో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఈస మిస్త్రీ కానీ, బీఎల్ ఎఫ్ అభ్యర్థి మహ్మద్ హాజీ కానీ ఎలాంటి ప్రభావం చూపలేదు.